బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం

తాండూరు రాజకీయం వికారాబాద్

బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం
– విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
– అమ్మాయిలుకు అండగా షీటీం సేవలు
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా నేరం అని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తెలంగాణ మైనార్టీ బాలికల స్కూల్, కాలేజీలో తాండూరు లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
kvcs
ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయడం చట్టరిత్యా నేరమని వివరించారు. అదేవిధంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే షీటీంను సంప్రదించాలని. వారికి అండగా.. భరోసా కల్పించేవిధంగా షీటీం సేవలను అందిస్తుందని అన్నారు.

అదేవిధంగా ప్యానల్ న్యాయవాధులు జిలాని, వెంకటేశ్వర్, ఆనంద్ లు మాట్లాడుతూ చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని అన్నారు. 18ఏండ్లలోపు ఉన్న అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ఫోక్సో యాక్టు ప్రకారం 20 ఏండ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీటీం సబ్ డివిజన్ ఇంచార్జ్ శేఖర్, న్యాయవాది మల్లేష్ యాదవ్, కోర్టు సిబ్బంది ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం