31 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈనెల 31 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల 31 నుండి జూన్ 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా జూన్ 21 నుండి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టాస్ డైరెక్టర్ పివి.శ్రీహరి తెలిపారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని విద్యార్ధులకు సూచించారు.

