రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

రక్తదానం చేసిన తండ్రి, కొడుకులు
– తాండూరు నాపరాతి వ్యాపారుల స్పూర్తి
– అభినందించిన సామాజిక సేవకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యవసరాల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఎంతో అవసరం. అందుకే సామాజిక వేత్తలు, సంఘాల నాయకులు రక్తదానాలు చేయాలని పిలుపునిస్తుంటారు.

మరో నిండు ప్రాణం కాపాడేందుకు ఎంతో మంది ముందుకు వచ్చి రక్తదానాలు చేస్తుంటారు. ఆసుపత్రుల్లో, రక్తదాన శిబిరాల్లో యువత నుంచి ఆ పై వయస్కులు పాల్గొని రక్తదానాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, తండ్రి కొడుకులు కూడా రక్తదానాలు చేసి సూర్తిని నింపుతుంటారు.

సరిగా అలాంటి సంఘటనే తాండూరులో చోటు చేసుకుంది. తాండూరుకు చెందిన ప్రముఖ నాపరాతి వ్యాపారి మనోజ్ కుమార్ సోని, తన కుమారులతో కలిసి రక్తదానం చేశారు. ఆదివారం తాండూరు పట్టణం జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం మనోజ్ కుమార్ ఆయన కుమారులు అనిరుధ్ సోని, ఉత్సవ సోనిలతో కలిసి రక్తదానం చేశారు. వారితో పాటు మరో వ్యాపారి సంజయ్ సోని కూడా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని కాపాడవచ్చని అన్నారు. దీనిని సామాజిక బాధ్యతగా భావించి అందరు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వ్యాపారులు చేసిన రక్తదానాన్ని పలువురు సామాజిక కార్యకర్తలు అభినందించారు.

బీసీ సంఘం సామాజిక సృహ..!