క్రైస్తవులకు ఎమ్మెల్యే కానుక
– నేడు సాయంత్రం తాండూరులో క్రిస్మస్ విందు
– తరలిరావాలని నేతల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కానుక అందించనున్నారు. ప్రతి యేడాది క్రైస్తవులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్రిస్మన్ విందును అందిస్తున్నారు. ఈ ఆనవాయితిలో భాగంగా నేడు తాండూరులో క్రైస్తవులకు విందు అందిస్తున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు తాండూరు పట్టణంలోని జీపీఆర్ గార్డెన్లో ఈ విందును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ క్రైస్తవులు, పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

