రోహిత‌న్న ఆద‌ర్శం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత‌న్న ఆద‌ర్శం..!
– కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్
– గుమాస్తా నగ‌ర్‌లో ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు యువ‌త‌కు యువ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప‌ట్ట‌ణంలోని 26వ వార్డు గుమాస్తా న‌గ‌ర్‌లో బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించారు. కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో వార్డు నాయ‌కులు, మ‌హిళ‌ల స‌మ‌క్షంలో కేక్‌ను క‌ట్ చేసి పంచిపెట్టుకున్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్ మాట్లాడుతూ అతి చిన్న వ‌య‌స్సులోనే ఎమ్మెల్యేగా ఎదిగిన పైలెట్ రోహిత్ రెడ్డి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచార‌న్నారు. అభివృద్ధిపై ఆయ‌న‌కు ఉన్న శ్ర‌ద్ద కూడ ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు అధ్య‌క్షులు చెన్ బ‌స‌ప్ప‌, మ‌హిళ అధ్య‌క్షురాలు ప్ర‌మీల‌, నాయ‌కులు ల‌క్ష్మారెడ్డి, ప్ర‌సాద్‌, ఆర్. సంతోష్‌, మ‌హేష్, అశోక్, న‌రేంద‌ర్, వెంక‌ట్ రెడ్డి, శ్రీ‌ను, విజ‌య్, స‌తీష్‌, ప్ర‌శాంత్, దినేష్‌, చంద్రు, శివ‌, పురుషోత్తం, నాగ‌బాబు, సాయిరెడ్డి, ర‌వి, నిరంజ‌న్, అనిల్, వార్డు ప్ర‌జ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.