మ‌హేంద్రుడి మాన‌వ‌త్వం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మ‌హేంద్రుడి మాన‌వ‌త్వం..!
– రోడ్డు ప్ర‌మాద బాధితుల ప‌ట్ల స్పంద‌న
– కారు ఆపి ఆటోలో చికిత్సకు త‌ర‌లింపు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి మాన‌వ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన బాధితుల ప‌ట్ల స్పందించి వారిని చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుప‌త్రికి త‌ర‌లించేలా కృషి చేశారు. వివ‌రాల్లోకి వెలితే..ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి తాండూరు నుంచి పెద్దేముల్ వైపు వెళుతున్నారు. మార్గ మ‌ద్య‌లోని గాజీపూర్ బ్రిడ్జి వ‌ద్ద బైక్ నుంచి పైడి ఇద్ద‌రు గాయాల‌పాలైన విష‌యాన్ని ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి గ‌మ‌నించారు. వెంట‌నే కారును ఆపి వారి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంట‌నే అటుగా వ‌స్తున్న ఆటోను ఆపి చికిత్స నిమిత్తం వారిని తాండూరులోని జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించేలా చొర‌వ చూపారు. మ‌హేంద్రుని మాన‌వత్వాన్ని ఎమ్మెల్సీ వెంట ఉన్న నాయ‌కులు, అభిమానులు మెచ్చుకున్నారు.