పాణంతో ప్ర‌యోగం..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

పాణంతో ప్ర‌యోగం..!
– చ‌స్తే ఎక్క‌డికెళ్తార‌నే తెలుసుకోవాల‌ని ఘోరం
– ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన యువ‌కుడు
ద‌ర్శిని డెస్క్: మ‌నిషి చ‌చ్చిపోతే స్వ‌ర్గానికి పోతారా.. న‌ర‌కానికి పోతారా.. పోతే తిరిగిరారా.. అనే అనుమానాలు అంద‌రికి వ‌స్తుంటాయి. మ‌నిషి మ‌ర‌ణం త‌రువాత జ‌రిగే ప‌రిణామాల‌ను ఇతివృత్తంగా తీసుకుని సినిమా ద‌ర్శ‌కులు క‌ల్పిత క‌థ‌ల‌తో చాలా సినిమాలు తీశారు. అందులో మంచి వాళ్లు స్వ‌ర్గానికి, చెడ్డ‌వాళ్లు న‌ర‌కానికి వెళ‌తార‌ని చూపించే విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే త‌మిళ‌నాడులోని తిరున‌ల్వెలి జిల్లాకు చెందిన లా చ‌దువుతున్న స‌ల్మాన్(19) అనే యువ‌కుడు తాను చ‌స్తే ఎక్క‌డికి వెళ్తాన‌ని తెలుసుకోవాల‌ని ఆరాట ప‌డ్డాడు. ఇంకేముంది.. చావు ర‌హ‌స్యాన్ని తెలుసుకునేందుకు ప్రాణంతో ప్ర‌యోగానికి సిద్ద‌మ‌య్యాడు. అనుకున్న విధంగానే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చ‌నిపోయే ముందు త‌న మ‌న‌సులో పుట్టుకొచ్చిన కోరిక‌ను తెలుపుతూ సూసైడ్ నోటు కూడ రాశాడు. అంతేకాకుండా త‌న వ‌ద్ద ఉన్న రూ. 5 వేల న‌గ‌దును త‌ల్లికి అంద‌జేయాల‌ని రాశాడు.ఈ సంఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో చ‌దువుకున్న యువ‌కులే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం అర్థ‌ర‌హిత‌మ‌ని మాన‌సిక‌ నిపుణులు, వైద్యులు, మేధావులు అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతున్నాయ‌ని, అతి తెలివితో.. ఆరాటాల‌తో అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌రాద‌ని సూచిస్తున్నారు.
https://youtu.be/FVeL8sgOx7k
కింది వ‌ర‌కు చూడండి..