బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలి
– తాండూరు డీఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప జననంపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలని తాండూరు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ ను వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), కౌన్సిలర్లు, నేతలు, అనుబంధ సంఘాల నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల కోడంగల్ లో జరిగిన సమావేశంలో టైరి నరేష్ అయ్యప్ప స్వామి జననంపై అనుచితంగా వాఖ్యలు చేయడంతో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. హిందూవుల మనోభావాలను దెబ్బతీసిన బైరి నరేష్ పై పలు పోలీస్టేషన్లలో కేసులు కూడ నమోదయ్యాయి. అయితే శనివారం తాండూరు డీఎస్పీని కలిసి నేతలు బైరి నరేష్ ను చట్టపరంగా కేసులు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, తాండూరు సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ బంటారం సుధాకర్, కౌన్సిలర్లు విజయదేవి.. సంగీత ఠాకూర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సంతోష్ గౌడ్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, అయ్యప్ప స్వాములు, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.