స్మార్ట్ చోరీ..!
– 4 క్షణాల్లో 40 లక్షలు లేపేశారు
– వైరల్ అవుతున్న వీడియో
దర్శిని డెస్క్: ఇలాంటి దొంగతనం మీరు ఎక్కడా చూసుండరు. ముగ్గురు వ్యక్తులు ఎంతో స్మార్ట్‌గా 4 క్షణాల్లోనే రూ. 40 లక్షలను లేపేశారు. సీసీ టీవిలో పుటేజీ వల్ల పోలీసులకు దొరికిపోయారు. ఆ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోలో బైక్‌పై డబ్బులతో వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు ఫాలో అయ్యారు. అంతే సిగ్నల్ క్రాసింగ్ దగ్గర మెల్లగా అతడి దగ్గరికి చేరుకుంటూ సెకండ్లలో డబ్బును దోచేశారు. ఆపై అక్కడి నుంచి ఏమి తెలియనట్లు వెళ్లిపోయారు. కాసేపటికి విషయం తెలిసి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడ బాధితుడు అనీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. అతను మహదేవ్ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి నార్త్ ఎవెన్యూలోని ఒకరికి ఇవ్వడానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి రూ. 38 లక్షలకు రికవరీ చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కింద వీడియో ఉంది లుక్కేయండీ..

