బరువు తక్కువ.. భద్రత ఎక్కువ..!
– ప్లాస్టిక్ సిలిండర్లతో ప్రమాదాల నియంత్రణ
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో తక్కువ బరువుతో పాటు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రవేశ పెట్టిన కాంపోజిట్ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకవచ్చింది. శుక్రవారం తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులతో కలిసి ఈ నూతన సిలిండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ గ్యాస్ సంస్థ సామాన్య గృహిణిలకు అనుకూలైనమైన విధంగా వెయిట్ లెస్ ఫ్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను ప్రవేశ పెట్టడం అభినందయనీయమన్నారు. దీని ద్వారా ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. 10 కిలోల, 6 కిలోల బరువుల్లో ఏజెన్సీలు సిలిండర్లను అందిస్తున్నాయన్నారు. బరువు తక్కువతో పాటు భద్రత పెంచె ప్లాస్టిక్ సిలిండర్ వినియోగం వెసులుబాటును అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ రాజేష్, సంగమేశ్వర్, అనిల్, కార్పోరేషన్ మేనేజర్ రమలు పాల్గొన్నారు.



