చెక్ పోస్టులో పకడ్బందీ నిఘా తప్పనిసరి
– వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి
– కొత్లాపూర్ చెక్ పోస్టును సందర్శించిన ఆడిషనల్ ఎస్పీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఎన్నికల సమయంలో చెక్ పోస్టు వద్ద పకడ్బందీగా నిఘా ఉంచడం తప్పనిసరి అని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం కొత్లాపూర్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి సందర్శించారు. కరణ్ కోట్ ఎస్ఐ ఐ మధుసూదన్ రెడ్డితో కలిసి నిఘాతో పాటు తనిఖీల గురించి ఆరా తీశారు. చెక్ పోస్టులో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఏమరుపాటు వహించరాదన్నారు. డబ్బు, మద్యం, మత్తు పదార్థాల రవాణాపై దృష్టి సారించాలన్నారు. నిఘాను పకడ్బందీగా నిర్వహించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

