మహిళ బంధు సీఎం కేసీఆర్
– కేసీఆర్ చిత్రపటానికి రక్షాబంధన్
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ మహిళ బంధువుగా నిలిచారని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అభివర్ణించారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని 9వ వార్డ్ సాయిపూర్ అంగన్వాడీ కేంద్రంలో రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దీపా నర్సింలు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి రాఖీ కట్టడం జరిగింది. అనంతరం నర్సింలు గారు తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆసరా, కళ్యాణలక్ష్మీ, షాధీముభారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అమలు చూస్తూ సీఎం కేసీఆర్ మహిళ బంధువుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నవీణా,ఆర్పీలు సైరభాను,హారిక, వి.ఆర్.ఓ స్వప్న,వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



