ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు స‌ర్కారు అండ‌

తాండూరు వికారాబాద్

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు స‌ర్కారు అండ‌
– సంఘం డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల‌కు తెలంగాణ స‌ర్కారు అండ‌గా ఉంటుంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధ‌వారం తాండూరులో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం 2022 సంవత్సర డైరీని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ఆర్టీసీలో సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ‌రువ‌ద‌న్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠ‌ల్‌ నాయక్, టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు ఆఫ్పూ(న‌యూం), న్యాయ‌వాది గోపాల్, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం స‌భ్యులు పాల్గొన్నారు.