మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
– వైభవంగా అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం
– ఊరేగింపు, పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– స్వాములకు సద్ది వడ్డించిన మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. గురువారం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

పట్టణ పురవీధుల్లో అయ్యప్ప స్వామి ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఊరేగింపులో అయ్యప్ప స్వాములతో కలిసి ముందుకు సాగారు. అదేవిధంగా తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయంలో యువనాయకుడు రుద్రుపాటిల్ అయ్యప్ప స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రోహిత్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించారు.

దేవాలయంలో భద్రేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు సద్ది వడ్డించారు. మరోవైపు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా భద్రేశ్వర దేవాయలంలో జరిగిన సద్దిలో పాల్గొన్నారు. స్వాములకు సద్ది వడ్డించారు. అంతకుముందు అయ్యప్ప స్వాముల ఊరేగింపులో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, బీఆర్ఎస్పీ నాయకులు జోగుల ఎబినేజర్, సందీప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

యువత సామాజిక సేవ ప్రశంసనీయం