మ‌ళ్లీ తెగిన కాగ్నా వంతెన

తాండూరు వికారాబాద్

మ‌ళ్లీ తెగిన కాగ్నా వంతెన
– భారీ వ‌ర‌ధ‌తో బీట‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు కాగ్నా న‌ది పురాత‌న‌ వంతెన మ‌ళ్లీ తెగిపోయింది. బుధ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి కాగ్నాన‌దిలోకి భారీగా వ‌ర‌ధ ఉధృతి పెరిగింది. పురాత‌న వంతెన పైభాగం నుంచి నీరు ఉధృతంగా ప్ర‌వ‌హించింది. దీంతో కాగ్నాన‌ది వంతెన‌కు గ‌తంలో మ‌ర‌మ్మ‌త్తులు జ‌రిగిన ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. వ‌ర‌ధ ప్ర‌వామానికి మ‌ర‌మ్మ‌త్తుల వ‌ద్ద వంతెన‌ కొట్టుకుపోయింది. గ‌త రెండెళ్లుగా వ‌ర్షాకాలం వ‌స్తే చాలు వంతెన తెగిపోవ‌డం జ‌రుగుతూనే ఉంది. వంతెన శిథిలావ‌స్థ‌కు చేరుకోవ‌డంతో ఈ సారి గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌లు కూడ నిర్వ‌హించ‌లేదు. నూత‌న వంతెన అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత పాత వంతెన‌పై రాక‌పోక‌లు స్థంభించాయి. అయినా చారిత్రాత్మ‌క క‌ట్ట‌డం కావ‌డంతో అధికారులు మ‌ర‌మ్మ‌త్తులు చేయించారు. ఈ సారి మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తారో లేదో వేచిచూడాలి.