ఇంటర్‌, ఎంసెట్ విద్యార్థులకు సూచన..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటర్‌, ఎంసెట్ విద్యార్థులకు సూచన..!
– ఇంటర్ తరువాత కేరీర్ పై కౌన్సిలింగ్
– చైతన్య కాలేజీ, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 18న ఎంసెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు తాండూరు హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, చైతన్య జూనియర్ కాలేజీ యజమాన్యం కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మల రెడ్డిలు తెలిపారు.

వచ్చే ఆదివారం హిందూ ధార్మిక పరిషత్, తాండూరు చైతన్య కాలేజీ యజమాన్యం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇందర్ తరువాత కేరీర్ ను ఎలా మలచుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక నిపుణులతో అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎంసెట్ క్వాలిఫై అయిన విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చైతన్య కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మల రెడ్డి సూచించారు.

ఇదికూడా చదవండి…

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతోనే అభివృద్ధి సాధ్యం