ఆసరాతో పేద‌ల‌కు చేయూత

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆసరాతో పేద‌ల‌కు చేయూత
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆసరా పథకంతో తెలంగాణ సర్కారు పేదలకు చేయూతనందిస్తుందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఆజయ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తన వార్డులోని 57 ఏండ్ల కింద కొత్తగా మంజూరైన ఫించన్ లబ్దిదారులకు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఫించన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. 57 ఏండ్లు నిండిన వృద్ధులకు, పేదలకు ఆసరాతో చేయూతనందిస్తుందారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో అర్హులైన వారందరికి ఫించన్ అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు పాల్గొన్నారు.