ఆదర్శంగా అంగన్‌వాడి భవనం
– భూమి పూజలో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సాయిపూర్‌లో నిర్మిస్తున్న అంగన్‌వాడి భవనాన్ని ఆదర్శంగా చేపట్టేందుకు కృషి చేస్తామని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో సాయిపూర్‌లో నిర్మిస్తున్న అంగన్‌వాడి భవనానికి డీఎంఎఫ్టీ ద్వారా రూ. 20 లక్షలను మంజూరు చేశారు. ఇటీవలే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సోమవారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మతో కలిసి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సహాకారంతో నిర్మిస్తున్న అంగన్‌వాడి భవనాన్ని తాండూరులోనే ఆదర్శంగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, అధికారులు, అంగన్‌వాడి టీచర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
