ఆరోగ్యాన్ని పెంచే డ్రాగన్ ఫ్రూట్
– క్యాన్సర్, గుండె సమస్యలు దూరం
– మధుమేహానికి దివ్య ఔషదం
దర్శిని డెస్క్ : డ్రాగన్ ప్రూట్ ఎక్కువగా మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో పెరిగే ఈ మొక్కలు ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలో కూడా వీటిని కొంతమంది సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పండించడం ద్వారా మంచి దిగుబడితోపాటు భారీ లాభాలు పొందడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గుండె సమస్యలు, క్యాన్సర్, మధుమేహం వంటి అనేక వ్యాధులను కూడా డ్రాగన్ ఫ్రూట్ దివ్య ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మిమ్మల్ని ఏ వ్యాధుల నుంచి రక్షిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె జబ్బులు దూరం
గుండె పనితీరుకు డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ పండులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా -3, ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు ఇందులో కనిపిస్తాయి. అదేవిధంగా దీని వినియోగం వల్ల గుండె జబ్బులను డ్రాగన్ ఫ్రూట్ తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌ను గుండె సమస్యలకు లోనయ్యేవారు తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ నుంచి రక్షణ
డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి రక్షణ పొందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచే విధంగా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇది రొమ్ము క్యాన్సర్ నుంచి మహిళలను రక్షిస్తుంది. ఇంకా, ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో తెలింది. ఇందులోని యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డ్రాగన్ ఫ్రూట్‌లో ఉన్నాయి. ఇంకా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌తో మధుమేహానికి చెక్.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీనితో పాటు మధుమేహం లేని వారు డ్రాగన్ ఫ్రూట్స్ తింటే భవిష్యత్తులో మధుమేహం దరిచేరదు. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.


