సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ గా గాజుల గాజుల కమలాకర్

తాండూరు వికారాబాద్

సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ గా గాజుల గాజుల కమలాకర్
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన దంపతులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్‌గా టీఆర్ఎస్ నాయకులు గాజుల కమలాకర్ నియామకయ్యారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌హాకారంతో ఆయ‌న‌కు చైర్మ‌న్ ప‌ద‌వి వ‌రించింది. ఈ మేరకు ఈనెల 7న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమ‌వారం గాజుల కమలాకర్ తన సతీమణి గాజుల మాధవితో కలిసి హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కలిశారు. ఆలయ చైర్మన్ గా నియమించడంపట్ల కమలాకర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈనెల 7న జరిగే పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మ‌రోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌హాకారంతో సీతారంపేట్ ఆల‌య అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని నూత‌న చైర్మ‌న్ క‌మ‌లాక‌ర్ పేర్కొన్నారు.