లారీ దొరికేసింది..!
– సిదిపేట్‌లో ఆచూకీ లభ్యం
– వదిలేసి పారిపోయిన దొంగ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో చోరీ అయిన లారీ సిద్దిపేట్‌లో దొరికింది. తాండూరు పోలీస్టేషన్‌లో నమోదైన లారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. తాండూరు పట్టణం లారీ అసోసియేషన్‌కు చెందిన నర్సింహారెడ్డి లారీ(టీఎస్09 యూఏ 6359)ను శనివారం రాత్రి విలియమూన్ చౌరస్తా వద్ద పార్కింగ్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన విషయం తెలిసిందే. యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా సంగారెడ్డి మీదుగా సిద్దిపేట్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఆదివారం పోలీసు ప్రత్యేక బృందం సిద్దిపేట్‌లో రోడ్డు పక్కకు ఆపిఉన్న లారీ గుర్తించారు. లారీని దొంగిలించిన వ్యక్తికోసం గాలించిన ఫలితం లేకుండా పోయింది. దోంగ పరారైనట్లు పోలీసులు నిర్దారించారు. లారీని స్వాదీనం చేసుకుని తాండూరుకు తీసుకవచ్చినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.

