జెర్సీ డైరెక్టర్‌తో మెగా పవర్‌స్టార్..!
– మరో సినిమా ఒకే చేసిన రామ్‌చరణ్
దర్శిని: జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓకే చెప్పినట్లు సమాచారం. సాయిదేవా ప్రొడక్షన్స్ బ్యానరుపై ఎన్వీ ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానరుపై రామ్‌చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పటికే అతడు నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు లెజెండ్ దర్శకుడు శంకర్‌తో కూడా అతడు పనిచేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా 2023లో విడుదల కానుంది. మరోవైపు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో ‘జెర్సీ’ సినిమా రీమేక్ చేస్తున్నాడు

