గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
– వికారాబాద్ జిల్లా చైర్మన్ రాజుగౌడ్
– సన్మానించిన బీసీ సంఘం, యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని రాజుగౌడ్ నివాసంలో యాలాల మండల బీసీ సంఘం నాయకులు, యువకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకం అయిన సందర్భంగా యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ చారీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్వీ నాయకులు ప్రకాష్ గౌడ్, జిలాని తదితరులు రాజుగౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘం నాయకులు, యువకులు కోరిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేవిధంగా శ్రద్ధ వహిస్తామన్నారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని లైబ్రరీలను ఆధునీకరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాకేష్, శాంతుకుమార్, బీసీ సంఘం యాలాల మండల ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, విజయ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.