మహిళ సెల్ ఫోన్ గుర్తింపు
– అప్పగించిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినియోగ దారులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు పట్టిస్తున్నారు. కొత్తగా వచ్చిన సీఈఐఆర్ ద్వారా మోబైల్ ఫోన్లను ట్రేస్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను గుర్తించి అందజేశారు. పట్టణ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సుతర్ మహానంద ఈనెల 5న పట్టణంలోని గాంధీచౌక్‌లో ఉదయం సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు.
ఈ విషషమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీఈఐఆర్ వ్యవస్థతో ఆమెకు చెందిన మోబైల్ ఫోన్‌ను గుర్తించారు. శనివారం ఎస్ఐ కాశినాథ్ పోలీస్టేషన్‌లో ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వినియోగదారులు ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోయిన ఫోన్లను గుర్తించి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


ఇదికూడా చదవండి….

