వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

తాండూరు వికారాబాద్

వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు
– శ్రీ సాయిమేధా స్కూల్లో సంబ‌రాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ సంస్కృతికి చిహ్న‌మైన బ‌తుక‌మ్మ సంబ‌రాలు తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో వైభ‌వంగా జ‌రుపుకున్నారు. సోమవారం బతుకమ్మ పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని స్కూల్ ఆవ‌ర‌ణ‌లో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ పాటలతో ఆటలాడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.