శభాష్.. రొంపల్లి శ్రావ్య…!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్.. రొంపల్లి శ్రావ్య…!
– అభినందించిన చైర్పర్సన్, సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ రొంపల్లి శ్రావ్య అంటూ విద్యార్థిని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు అభినందించారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైశ్య ఉపాధ్యాయులు, విద్యార్థులకు సన్మానం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్లో 92 శాతం ఉత్తీర్ణత ఫలితాలను సాధించిన రొంపల్లి సంతోష్ కుమార్ కూతురు రొంపల్లి శ్రావ్యను వెండి పథకం, మెమెంటోసు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, ఎంపీటీసీ దేవగారి రాములు, నగరేశ్వర దేవాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి కోటమురళికృష్ణ, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, సహాకాదర్శి దాదాపురం రవీందర్, ఆర్యవైశ్య మహిళ సంఘం, వాసవి సంఘం, వైశ్య ఫెడరేషన్, అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.