వైభవంగా బోడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు..!
– ముందుండి నిర్వహించిన విఠల్ నాయక్
– బాణాపూర్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
– శాస్త్రోక్తంగా ధ్వజస్థంబ ప్రతిష్టాపన
– ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు
– బోనాలతో మొక్కులు తీర్చుకున్న మహిళలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం బాణాపూర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బొడ్రాయి, ద్వజస్థంబ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభోగంగా నిర్వహించారు.

మూడు రోజులుగా గ్రామంలో జరుగుతున్న ఉత్సవాలు విఠల్ నాయక్ ముందుండి నిర్వహించారు. శనివారం గ్రామం నడిబొడ్డున నాభిశిల(బొడ్రాయి)ని ప్రతిష్టాపించారు. అదేవిధంగా హనుమాన్ ఆలయం ఎదురుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమాలను వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బొడ్రాయి, ద్వజస్థంబ ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు ముందు డ్యాన్స్ మాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో పోతురాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా విఠల్ నాయక్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్తా విఠల్ నాయక్ మాట్లాడుతూ బాణాపుర్ గ్రామ శ్రేయస్సు కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

గ్రామ నడిమద్యలో ప్రతిష్టించే పవిత్రమైన బొడ్రాయి గ్రామానికి నాభి (బొడ్డు) వంటిదని, దుష్టశక్తుల నుండి ఊరిని రక్షించే గ్రామ దేవతగా భావిస్తారని అన్నారు. గ్రామ నిర్మాణం సమయంలో, కరువు కాటకాలు, అరిష్టాలు కలగకుండా ఉండేందుకు భవనీయ పూజారులచే ఈ రాయిని శాస్త్రోక్తంగా ప్రతిష్టాపించడం జరిగిందని వెల్లడించారు. ఊరి మధ్యలో కొలువై ఉండి రక్షణ కల్పిస్తుందన్నారు. గ్రామంలో అకాల మరణాలు, రోగాలు, క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ రాయి అంగరక్షకుడిగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భవాని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బానాపూర్ సర్పంచ్ వినావత్ శంకర్ నాయక్, తాండూరు మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ బాబ్యా నాయక్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు రాములు నాయక్, గోపాల్ రవి నాయక్, మీదింటి శాకప్ప, రాజు నాయక్ రాజు తో పాటు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


