గాంధీన‌గ‌ర్‌లో గులాబీ పండ‌గ

తాండూరు

గాంధీన‌గ‌ర్‌లో గులాబీ పండ‌గ
– టీఆర్ఎస్ జెండాను ఎగుర‌వేసిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి గాంధీనగర్‌లో గులాబీ జెండా పండ‌గ‌ను ఘనంగా నిర్వ‌హించారు. గురువారం 20వ వార్డులో టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు సంతోష్ కుమార్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో టీఆర్ఎస్ నాయ‌కులు తెరాస పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మున్సిప‌ల్ వైస్ ఛైర్పర్సన్ దీప నర్సిములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మంకల్ రఘు, అశ్విని గుండప్ప, తెరాస సీనియర్ నాయకులు నర్సిములు, శ్రీనివాస్ చారీ, రాజుగౌడ్ త‌దిత‌రులు హాజ‌రై జెండాకు వంద‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కౌన్సిల‌ర్ ఇర్ఫాన్, హరిగౌడ్, ఇంతియాజ్, శివ, ప్రశాంత్, నగేష్, సాయి, రవి, బబ్లు, ప్రదీప్,ఆకాష్,సూరి,పింటు తదితరులు పాల్గొన్నారు.