ముమ్మరంగా పీఆర్టీయూ సభ్యత్వ నమోదు
– తాండూరు మండలంలోని పాఠశాలల్లో నిర్వహణ
– స్వీకరించిన ఉపాధ్యాయులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలంలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరిగింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పీఆర్టీయూ సంఘం ఆదేశాల మేరకు మండలంలోని అంతారం(యూపీఎస్), అల్లాపూర్ (యూపీఎస్), సిరిగిరిప పేట్(యూపీఎస్), ఐనెల్లి(యూపీఎస్), కోటబాస్పల్లి(యూపీఎస్), మల్కాపూర్ గని(పీఎస్), సంగెంకలాన్ (యూపీఎస్), కరణ్ కోట్-బీ(పీఎస్), ఎస్సీ కాలనీ(పీఎస్), చంద్రవంచ(పీఎస్), చిట్టిగణాపూర్ (పీఎస్), చెన్ గెష్ పూర్(పీఎస్), కోనాపూర్(పీఎస్), ఎల్మకన్నె(పీఎస్) స్కూళ్లలో తాండూరు మండల శాఖ అధ్యక్షులు ఊరడి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై పీఆర్టీయూ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర పత్రికా సంపాదకులు బాకారం జైపాల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ రాం నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు నాగప్ప, జీ.నర్సిరెడ్డి, జిల్లా అసోసియేట్ జగదీష్, మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జట్టూరు శ్రీనివాస్, కరణ్ కోట్ కాంప్లెక్స్ హెచ్ఎం, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కుర్వ శ్రీశైలం, మండల అసోసియేట్ సాగర బాలకృష్ణ, ప్రభాకర్ చారి, మండల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, పి. రాజేశ్వర్, ఐనెల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి మున్నూరు బాలరాజు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

