త్వరగా కోలుకునే వైద్యం అందించండి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

త్వరగా కోలుకునే వైద్యం అందించండి
– అతిసార బాధితులపై ప్రత్యేక శ్రద్ద చూపించాలి
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మమేందర్ రెడ్డి
– బాధితులకు భరోసా అందించిన ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: అతిసార బారిన బాధితులు త్వరగా కోలుకునేవిధంగా వైద్యం అందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులతో అన్నారు. రెండు రోజుల క్రితం యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో పలువురు అతిసారకు గురై ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జిల్లా ఆసుపత్రికి చేరుకుని అతిసార బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఆరోగ్యంగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా ఆసుపత్రి సూపరిండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జుంటుపల్లి గ్రామాన్ని కూడ సందర్శించారు. పలువురు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, సర్పంచ్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్‌ నీరజా బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మసూద్, అరవింద్ రెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి బి రఘు, అశోక్ ముదిరాజ్, వైద్యులు తదితరులు ఉన్నారు.