కొనుగోలు కేంద్రాలతోనే మద్దతు ధర
– సన్నరకం వడ్లకు సర్కారు బోనస్
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– యలాలలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ధాన్యం రైతులకు మద్దతు ధర అందించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం యాలాల మండల కేంద్రంతో పాటు విశ్వనాథ్ పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తుందని అన్నారు. అంతేకుండా సన్నరకం వడ్లకు సర్కారు రూ.500ల బోనస్ కూడా అందిస్తుందని అన్నారు. ధాన్యం రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఐకేపీ సభ్యులు పారదర్శంగా కొనుగోళ్లు జరిపి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, యాలాల పీఏసీఎస్. చైర్మన్ సురేందర్ రెడ్డి, భీమయ్య, పలువురు నాయకులు, రైతులు, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

