కొంగు గొంతుకు బిగించి హత్య..!

క్రైం తాండూరు వికారాబాద్

కొంగు గొంతుకు బిగించి హత్య..!
– గుర్తుపట్టకుండా బాడీకి నిప్పు
– వీడిన సగం కాలిన మహిళ మర్డర్ మిస్టరీ
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: వెరకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో మహిళను చీరకొంగు మెడకు బిగించి హత్య చేశాడు ఓ కిరాతకుడు. గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి నిప్పంటించి పారిపోయాడు. ఈ నెల 15న వికారాబాద్‌ జిల్లాలోని పులమద్దీ గ్రామ శివారులో సగం కాలిన గుర్తు తెలియని మహిళ మర్డర్‌ మిస్టరీని పోలీసులు చేధించారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. చేవేళ్లలోని సీపీఐ కాలనీకి చెందిన ఎర్రోళ్ల అనసూజ(35)తో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం తెల్లాపూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తలారి బాబు అలియాస్ అవుసులపల్లి బాబుతో గత 3, 4 ఏండ్లుగా అక్రమసంబంధం ఉంది.

బాబు అప్పుడప్పుడు అనసూజకు డబ్బులు ఇచ్చేవాడు. తీసుకున్న డబ్బులు ఇవ్వమని పలుమార్లు ఇవ్వమని అడిగినా ఆమె ఇవ్వడం లేదు. దీంతో పాటు అనసూజ తనతో పాటు వెరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో అమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

మాయ మాటలు చెప్పి..
అనుకున్న దాని ప్రకారం ఇద్దరం కలుసుకుందాని బాబు అనసూజకు ఫోన్‌ చేసి పులమద్దీ గ్రామానికి తీసుకవచ్చాడు. అక్కడ ఆమెకు మద్యం తాపించాడు. మాటలు కలిపి వెరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో గొడవకు దిగాడు. కోపంతో అనసూజ ముఖంపై పిడి గుద్దులు గుద్ది, ఆమె చీర కొంగుతోనే మెడకు బిగించి హత్య చేశాడు. ఆమె చనిపొయిందని నిర్దారించుకున్న తరువాత పక్కన్న చిన్న కాలువలోకి దొబ్బి వెంట తెచ్చుకున్న అగ్గిపెట్టెతో బాడీకి నిప్పంటించి పారిపోయాడు. దీంతో మృతదేహం సగమే కాలిపోయింది.

దొరికిపోయాడు ఇలా..
జిల్లాలో కలకలం సృష్టించిన సగం కాలిన మృతదేహం లభ్యమైన ఘటనపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వికారాబాద్‌ డీఎస్పీ నర్సింలు ఆధ్వర్యంలో పట్టణ సీఐ టంగుటూరీ శ్రీను, మోమిన్ పేట్ సీఐ ఆంజనేయులు, నవాబ్ పేట్ ఎస్ఐ భరత్ భూషణ్‌ , ధారూర్ ఎస్ఐ సంతోష్‌ కుమార్, మర్పల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, ఐటి సెల్ అధికారులతో 4,5 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చేవేళ్లలో మహిళ అదృశ్యమైనట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని సంప్రదించారు. ఆధారాలను పరిశీలించిన తరువాత హత్యకు గురైంది అనసూజనే అని నిర్ధారించుకున్నారు. ఆమెతో అక్రమ సంబంధం ఉన్న బాబును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్యచేసినట్లు నేరం అంగీకరించాడు.

నిందితుడిపై గతంలో హత్య కేసు
ఈ కేసులో నిందితుడుగా ఉన్న అవుసుల బాబు గతంలో తన సొంత గ్రామం వికారాబాద్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో ఉండగా ధారూర్ మండలం రాజాపూర్‌లో స్థిరపడ్డారని తెలిపారు. గతంలో హత్యకేసు నమోదైనట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. 2016లో వికారాబాద్‌ పోలీస్టేషన్‌లో పరిధిలో నమోదైన హత్యకేసులో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. హత్య కేసు తరువాత నిందితుడు బాబు తన చిరునామాలు మారుస్తూ జీవిస్తున్నాడని తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!