వెయ్యికి కొడితే రూ. 2వేలు
– ఏటిఎంలో నుంచి విత్ డ్రా
– ఎగబడిన జనాలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఓ ఏటిఎంలో రూ. 1000లు డ్రా చేసేందుకు ఎంటర్ చేస్తే రూ. 2 వేలు వచ్చాయి. మొదట ఆశ్ఛర్యం వేసినా మళ్లీ డ్రా చేస్తే మళ్లీ రూ. 2వేలు వచ్చాయి. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట్ జిల్లాలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట్ నగరంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. ఓ ఏటిఎం సెంటర్ వద్దకు వినియోగదారుడు రూ. 1000 డ్రా చేససేందుకు వెళ్లాడు. ఏటీఎంలో రూ. 1000లు విత్ డ్రా ఎంటర్ చేస్తే రూ. 2000 వచ్చాయి. ఈ విషయాన్ని అందరికి తెలపడంతో సంఘటన కలకంల రేపింది. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు పెద్ద ఎత్తున ఏటీఎమ్‌కు క్యూ కట్టారు. అప్పటికే చాలా మంది డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం కాస్త ఆ నోట, ఈ నోట విని బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఏటీఎమ్ వద్దకు చేరుకున్న అధికారులు ఏటీఎమ్‌ను మూసేశారు. కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపం కారణంగా ఎంటర్ చేసిన దాని కంటే తక్కువ అమౌంట్ వస్తే మరికొన్నిసార్లు ఎక్కువ అమౌంట్ వస్తుంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు. వెంటనే ఏటీఎమ్ లో నెలకొని సాంకేతిక సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. అయితే అప్పటికే డబ్బులు డ్రా చేసుకున్న వారి నుంచి డబ్బులను ఎలా రికవరీ చేయాలన్న అంశంపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

