విద్యార్థులు, యువతకు సామాజిక న్యాయమే ధ్యేయం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులు, యువతకు సామాజిక న్యాయమే ధ్యేయం
– బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పోరుయాత్ర
– రాష్ట్ర కార్యనిర్వహఖ అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్
– తాండూరులో జరిగే పోరుయాత్రను జయప్రదం చేయండి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో బీసీ విద్యార్థుల, యువత చదువులో సామాజిక న్యాయం కోసం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో బీసీ విద్యార్థులు, యువజనుల పోరుయాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈడిగ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చదువు కోసం, సామాజిక న్యాయం కోసం పాలమూరు నుంచి పట్నం వరకు డిసెంబర్ 2 నుంచి జనవరి 8వ తేది వరకు బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 27న తాండూరులో నిర్వహించే పోరుయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా విద్యార్థి నాయకులు గొట్టిగ అవిల్ రాకుమార్, నాయకులు మాణిక్ రావు, ఆనంద్ కుమార్, అశోక్, మాణిక్యప్ప, రాజు, శ్రావణ్, అశీష్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.