దత్తాత్రేయుని కృప అందరిపై సిద్ధించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయుని కృప అందరిపై సిద్ధించాలి
– తాండూరు మాజీ ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్
– చేవేళ్ల ఎమ్మెల్యేతో కలిసి భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దత్తాత్రేయ స్వామి కృప ప్రజలందరిపై సిద్ధించాలని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. సోమవారం పౌర్ణమి సందర్భంగా కర్ణాటకలోని గానుగపూర్ లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి కుటుంబ సమేతంగా స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య విఠల్ నాయక్ చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అభినందించారు. అదేవిధంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ దత్తాత్రేయుని కృప ప్రజలందరిపై ఉండాలన్నారు. భక్తులకు అన్నదానం చేయడం గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్ సతీమణి వర్త్యా కిష్టమ్మ, కూతురు వర్త్యా ప్రశాంతి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు