రూ. 500 గ్యాస్ గైడ్‌లైన్స్ ఇవే..!
– సబ్సీడీ పొందేందుకు ఈ అర్హతలు తప్పనిసరి
– జీఓ జారీ చేసిన రేవంత్ సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రూ.500లకే గ్యాస్ సిలిండర్‌పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో మహాలక్ష్మీ కింద అమలు చేయనున్న గ్యాస్ సిలిండర్ పథకం కోసం రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సబ్సీడీ రాయితీ పొందాలంటే ఈ అర్హతలు ఉండాలని ఉత్తర్వులలో స్పష్టం చేసింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు. పథకం అమలు ఎలా చేస్తారు? ఎవరు ఈ పథకానికి అర్హులు? వంటి కీలక వివరాలను గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి.
– సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించింది ప్రభుత్వం.
– ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
– మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు.
– వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి.
– ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేస్తారు.
– గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇవ్వనుంది. సంస్థల నుంచి DBT ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు.
– జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం.
– భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.
– 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లోకి సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి..

