ఫ్లాష్.. ఫ్లాష్..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఫ్లాష్.. ఫ్లాష్..!
– గ్రూప్‌-4 దరఖాస్తులకు బ్రేక్
– ప్రక్రియను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ
– దరఖాస్తుల కొత్త తేదీలు ఎప్పుడంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్‌-4 అభ్యర్థులకు సర్కారు షాక్ ఇచ్చింది. నేటి నుంచి ప్రారంభం కానున్న దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది. దీంతో పాటు దరఖాస్తుల కోసం కొత్త తేదీలను వెల్లడించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది.