మీ టెన్త్ మెమో పోయిందా..!
– ఇప్పుడు డూప్లీకేట్ పొందడం ఈజీ
– ఆఫీసుల చుట్టూ తిరిగే పనేలేదు
– ఎలా తీసుకోవాలో తెలుసా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : విద్యార్థి దశలో పదో తరగతి కీలకమైంది. బోర్డు ఎగ్జామ్ తరువాత పొందే మెమో ఎంతో ముఖ్యమైంది. కొన్ని సందర్భాలలో సర్టీఫికెట్ పోగొట్టుకుని తిప్పలు పడుతుంటారు.

డూప్లీకేట్ సర్టిఫికెట్ పొందేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పడు డూప్లీకేట్ సర్టిఫికెట్ పొందడం ఎంతో ఈజీ. మీసేవల ద్వారా రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, ఇటు విద్యా ర్థుల కోసం సరికొత్తగా ఎస్సెస్సీ ఈ-మెమోల సేవలను అందుబాటులోకి తెచ్చింది.

మీసేవ పోర్టల్లో తాజాగా ఎస్సెస్సీ మెమో ఈ-కాపీ అనే సరికొత్త సేవను ప్రవేశపెట్టింది. 2004 నుంచి 2024వ సంవత్సరం వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ డూప్లికేట్ ఈ-మెమోను మీసేవ ద్వారా పొంద వచ్చు. కేటగిరీ ఏ కింద ఒక్కో దరఖాస్తుకు కేవలం రూ.62 రుసుం చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థి వివరాలను నమోదు చేసిన వెంటనే మీ సేవ సెక్యూర్ బేస్ సర్టిఫికెట్పై ఈ-మెమో ప్రింట్ రూపంలో అందుతుంది.

ఒరిజినల్ మెమోలు పోగొట్టుకున్న వారికి.. అత్యవసరంగా కావాల్సిన వారికి ఈ డిజిటల్ మెమో ఎంతో ప్రయోజనకరం గా మారనుంది. పూర్తిగా కాగిత రహితం.. ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. మీ సమీపంలోని మీసేవ కేంద్రానికి ఆధార్ కార్డు, పోయిన మెమో జిరాక్స్ కాపీ (ఉంటే) తీసుకుని వెళ్లండి. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీ, అఫిడవిట్ సిద్ధం చేసి చలానా చెల్లిస్తే, వాళ్ళే మీకు దరఖాస్తు పూర్తి చేసి ఇస్తారు.


