టీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్లో ఇష్టారాజ్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్లో ఇష్టారాజ్యం..!
– విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
– పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ శివారు కోకట్ గ్రామ పరిధిలోని తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్‌ స్కూల్‌(టీఎస్‌డబ్ల్యూఆర్‌)లో నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి అన్నారు. సోమవారం టీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్, కళాశాల సందర్శనకు వెళ్లగా నిర్వహకులు విద్యార్థులతో మాట్లాడేందుకు అనుమతించలేదు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్‌డబ్ల్యూఆర్‌ లో నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని విమర్శించారు. స్కూల్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. తల్లిదండ్రులు వస్తే వారు విద్యార్థులను కలిసేందుకు అనుమతించడం లేదని అన్నారు. స్కూల్‌లో వాచ్‌ మెన్‌ లేకున్నా సిబ్బందితో సరిపెడుతున్నారని అన్నారు. స్కూల్‌లో విద్యార్‌థులకు పురుగుల అన్నం వడ్డిస్తున్నారని, అడిగితే అదే తినాలని బెధిరింపులకు పాల్పడుతున్నారనే తమకు తెలిసిందన్నారు. ఈ కారణంగా స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదన్నారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌లో సమస్యలు పరిష్కరించి.. విద్యార్థులకు వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ విద్యార్థం సంఘం నాయకులు ఉన్నారు.