ఇదేం రాక్షస పాలన..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇదేం రాక్షస పాలన..!
– కౌశిక్ రెడ్డిపై దాడి దుర్మార్గం
– బీజేపీ గుండాలపై చర్యలు తీసుకోవాలి
– సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ రాక్షస పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ద్వజమెత్తారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ గుండాలు దాడులు చేయడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుతో పాటు ఇండ్లపై దౌర్జన్యాలకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని బెంగాల్‌, యూపీ, బీహార్‌ లాగా తయారు చేస్తున్నారని మండిపడ్డారు.

మీడియా సమావేశంలో విమర్శిస్తే దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై, విమర్శించే వారిపై దాడులు, కేసులు నమోదు చేయడం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని అన్నారు.

గుండాలు దాడులు చేయడం పట్ల సమాధానం చెప్పాలని అన్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతపెద్ద నాయకులైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని విమర్శించారు. దీనిపై స్పందించకపోతే ఈ విధమైన పాలనపై తగిన గుణపాఠం తప్పదని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఎవరు కాపాడుతారో నిర్ణయించుకోవాలని అన్నారు.

చిరస్మరణీయుడు చందు మహరాజ్