ఇచ్చిన హామిలు విస్మ‌రించ‌డం సిగ్గుచేటు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇచ్చిన హామిలు విస్మ‌రించ‌డం సిగ్గుచేటు
– కామ‌న్ మ్యాన్‌కు మ‌ద్ద‌తు తెలిపిన కాంగ్రెస్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఎన్నిక‌ల వేళ అభివృద్ధిపై ఇచ్చిన హామిల‌ను విస్మ‌రించ‌డం సిగ్గుచేట‌ని తాండూరు కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శించారు. తాండూరు ప‌రిస్థితిని నిర‌సిస్తూ ఓ కామ‌న్ మ్యాన్ చేప‌ట్టిన నిర‌స‌న‌కు కాంగ్రెస్ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపారు. తాండూరులో రోడ్ల దుస్థితి, కాలుష్యం పెర‌గ‌డానికి నా ఓటే కార‌ణ‌మంటూ సోమ‌వారం తాండూరు మండ‌లం అంతారం గ్రామ స‌మీపంలో రిజ్వాన్ అనే వ్య‌క్తి మెడ‌లో చెప్పుల దండ వేసుకుని వినూత్న నిర‌స‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఈ నిర‌స‌న‌కు తాండూరు కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ నాయ‌కులు హాజ‌రై నిర‌స‌లో బైటాయించిన రిజ్వాన్‌పై మ‌ట్టి నీళ్ల‌ను చ‌ల్లి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్‌గౌడ్‌తో పాటు ప‌లువురు మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో అభివృద్ధిపై హామిలు ఇచ్చి విస్మ‌రించ‌డం సిగ్గుచేట‌న్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల తీరును నిర‌సిస్తూ సామాన్యుడు చేప‌ట్టిన పోరాటానికి అండ‌గా ఉంటామ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యువజన కాంగ్రెస్ నాయకుడు సంతోష్, ఎన్ఎస్‌యూఐ వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాలల్, సమ‌ద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.