బకెట్లో బాలుడు తలకిందులు

క్రైం తాండూరు వికారాబాద్

బకెట్లో బాలుడు తలకిందులు
– పోయిన పసివాడి ప్రాణం

– వికారాబాద్‌లో విషాదం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగ పూట విషాదం నెలకొంది. బకెట్‌లో ఏడాది తలకిందులై ఓ పసిప్రాణం పోయింది. ఈ సంఘటన శనివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని పాత శిశు మందిర్ సమీప ప్రాంతానికి చెందిన దత్తేశ్వర్ భాగ్యలక్ష్మిలా చిన్న కుమారుడు విఖ్యాత్. గత డిసెంబర్ 24న విఖ్యాత్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ వేడుక సంతోషాలను మరువక ముందే ఇంట్లో విషాదం నెలకొంది. శనివారం ఉదయం విఖ్యాత్ ఆడుకుంటూ బాత్ రూం సమీపంలోని బకెట్లో వెళ్లి అందులో తలకిందులుగా పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీశారు. అప్పటికే విఖ్యాత్ ప్రాణాలు విడిచాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని ముద్దాడుతూ రోధించిన తీరు స్థానికుల చేత కంట కన్నీరు పెట్టించింది.