మృత్యు లారీ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మృత్యు లారీ..!
– తండ్రీ, కొడుకులు వెళుతున్న స్కూటీకి ఢీ
– కొడుకు దుర్మరణం, తండ్రికి తీవ్రగాయాలు
– తాండూరు మండలంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతివేగంగా వెళుతున్న ఓ లారీ మృత్యువు వాహనంగా మారింది. తండ్రి, కొడుకులు వెళుతున్న స్కూటీకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన ఈడిగి నర్సింలు(35) వంటి పనిచేస్తూ ఓ కిరణాషాపు నిర్వహిస్తున్నాడు.

అయితే తండ్రి గోపయ్య అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం తాండూరులోని ఆసుపత్రిలో చూపించుకుని తిరిగి బయల్దేరాడు. తండ్రి గోపయ్యను ఇంట్లో దించేందుకు ఇద్దరు కలిసి స్కూటీపై వెళుతున్నాడు. చెంగోల్ సమీపంలోని బై పాస్ రోడ్డు సమీపంలో ఓ లారీ(టీఎస్34 టీబీ0118) వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింలు స్కూటీ పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గోపయ్యకు గాయాలు అయ్యాయి.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 108 సహాయంతో నర్సింలు మృతదేహాన్ని, తండ్రి గోపయ్యను తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నర్సింలు మృతదేహాన్ని మార్చురికి తరలించారు. గోపయ్యను పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. మృతుడు నర్సింలుకు భార్య నర్మద, ఇద్దరు కుమారులు ఉన్నారు. నర్సింలు మృతితో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణం లారీ అతివేగంతో పాటు రాంగ్‌ రూట్‌లో వచ్చినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై దర్యప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..!