పోలీస్ ట్రైనింగ్ సెంటర్ రెడీ..!

కెరీర్ తాండూరు వికారాబాద్

పోలీస్ ట్రైనింగ్ సెంటర్ రెడీ..!
– శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
– అభ్యర్థుల కోసం ఏర్పాట్ల పరిశీలన
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: పోలీసు ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రైనింగ్ సెంటర్ రెడీ అవుతోంది. సోమవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

జిల్లా కు పోలీస్ శిక్షణ కొరకు రాబోయే పోలీస్ సిబ్బందికి వసతులలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఏమైనా మరమ్మతులు ఉన్నాయా అని పరిశీలించారు. ఏర్పాట్లలో లోటు పాట్లు ఉంటే వెంటనే పూర్తిచేయాలనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్, బ్యారేక్ లు, మంచి నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బాత్రూం లు, తరగతి గదులు మొదలగున వాటిలలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మరమ్మత్తులు ఏమైనా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మేజర్ మరమ్మత్తులు ఉన్నట్లు అయితే ఉన్నత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎస్పీ వెంట డీటీసీ అదనపు SP శ్రీ మురళీధర్, డీటీసీ డీస్పీ విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.