చీటర్.. బ్రోకర్..!
– తాండూరుకు పట్టిన చీడ మురళీకృష్ణ గౌడ్
– ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ చీటర్.. బ్రోకర్.. తాండూరుకు పట్టిన చీడ అంటూ తాండూరు బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్ లో జిల్లా గ్రంథాలయ సంస్క చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లెళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, నరేందర్ గౌడ్ తదితరులు మీడియాతో సమావేశం అయ్యారు. యాలాల మండలం దేవనూర్ శివస్వాముల ఘటనలో జైలుకు రిమాండుపై వెళ్లి తిరిగి వచ్చిన మురళీకృష్ణ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని నేతలు ఖండించారు. జైలుకు వెళ్లినంత మాత్రానా మురళీగౌడ్ ఏమైనా పోటుగాడా అంటూ విమర్శించారు. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత వాఖ్యలు చేసిన మురళీకృష్ణ గౌడ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యే పంచన ఉంటూ మురళీకృష్ణ గౌడ్ ఎన్నో మోసాలు చేసేందుకు కుట్రలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతోనే వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవిని పొందారని, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేను విమర్శించడం పద్ధతి కాదన్నారు. మురళీకృష్ణ గౌడ్ పెద్ద మోసకారి, బ్రోకర్, చీటర్ అంటూ గతంలో ఆయనపై జరిగిన దాడులు, కేసులను ఉదహరిస్తూ విమర్శించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేరుతో ఎన్నో అరాచకాలు.. సెటిల్ మెంట్లు, అక్రమ వ్యాపారాలు చేశారని ఆరోపించారు. శివస్వాముల ఘటనను అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి, దళితున్నిపై దాడి చేయించినందుకే ఆయన జైలుపాలు అయ్యారని అన్నారు. బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డినే కారణమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దానికి ఎమ్మెల్యేను బాధ్యున్ని చేయడం పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మురళీకృష్ణ గౌడ్ తాండూరుకు, బీజేపీ పార్టీకి పట్టిన చీడ లాంటి వారని ద్వజమెత్తారు. అలాంటి మురళీకృష్ణ గౌడ్‌కు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు తెలపడాలన్ని కోతి, కల్లు కోతి దోస్తానా అంటూ వి మర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ కౌన్సిలర్లు అస్లాం, వెంకన్న గౌడ్, భీంసింగ్, దేవాలయాల చైర్మన్లు బంటారం సుధాకర్ రాజన్ గౌడ్, సంజీవరావు, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, నాయకులు ఈర్షాద్, మోహిజ్ ఇంతియాజ్, టైలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

