కటకటాల్లోకి కామాంధుడు

క్రైం తాండూరు వికారాబాద్

కటకటాల్లోకి కామాంధుడు
– రిమాండుకు మైనర్ బాలిక అత్యాచార నిందితుడు
– వివరాలు వెల్లడించిన తాండూరు రూరల్ సీఐ రాంబాబు 
తాండూరు, దర్శిని ప్రతినిధి: మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు కటకటాల పాలయ్యాడు. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలో అత్యాచారా నిందితున్ని పోలీసులు రిమాండుకు తరలించారు. మంగళవారం తాండూరు రూరల్ సీఐ రాంబాబు యాలాల ఎస్ఐ అరవింద్‌ కుమార్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. యాలాల మండలంలోని పెర్కంపల్లి తాండకు చెందిన మైనర్ బాలికపై పెర్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు రాఘవులు అలియాస్ రఘుపతి(25) అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒంటరిగా ఉన్న బాలికను కారులో ఎక్కించుకుని దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం బహిర్కతం అయ్యింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు యాలాల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు రఘుపతిని మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ మేరకు తాండూరు న్యాయస్థానంలో నిందితున్ని హాజరు పరిచి రిమాండుకు తరలించడం జరిగిందని తాండూరు రూరల్ సీఐ రాంబాబు వెల్లడించారు.