జుంటుపల్లి రామస్వామి హుండీ లెక్కింపు
– జాతరలో రూ. 3,39,316ల ఆధాయం
– వెల్లడించిన దేవాదాయ శాఖ అధికారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం జుంటుపల్లి రామస్వామి దేవాలయ జాతర హుండీ లెక్కింపు నిర్వహించారు. శనివారం దేవాదాయ శాఖ అధికారి బాల్రాజ్, శేఖర్ గౌడ్ల సమక్షంలో లెక్కింపు కొనసాగింది. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా జుంటుపల్లిలో జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎంతో ప్రసిద్ది చెందిన జుంటుపల్లి రామస్వామి జాతర ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో వెలసిన సీతారాములను దర్శించుకుని మొక్కుకుంటారు. ఇందులో భాగంగా హుండీలో నగదు, కానుకలను సమర్పించుకుంటారు. ఈ ఏడాది కూడా జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగాయి. శుక్రవారం జాతర ఉత్సవాలు ముగియడంతో శనివారం రామస్వామి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయానికి రూ. 3లక్షల 39 వేల 316ల ఆధాయం వచ్చిందని దేవాదాయ శాఖ అధికారి బాల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నాగేశ్వర్ రావు, ఆలయ అర్చకులు వాది పంతులు, కమిటి సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

