మున్సిపల్‌ను గాడిన పెట్టండి

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్‌ను గాడిన పెట్టండి
– ప్రతినెల సమావేశాలు నిర్వహించాలి
– కమీషనర్, ఖాళీ పోస్టులు భర్తీచేయాలి
– జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నేతల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిపాలను గాడిలో పెట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో బీజేపీ నేతలు కోరారు. శనివారం తాండూరుకు వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డిని బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంబారం లావణ్య, బాలప్ప తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్‌లో ప్రతినెలా సమావేశాలు జరగడం లేదని, చాలా కాలంగా కమిషనర్‌తో పాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రతినెలా సమావేశాలు నిర్వహించేలా చూడాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ ఖాళీగా ఉన్న కమీషనర్ పోస్టుతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా చూడాలని కోరారు. మున్సిపల్ పరిపాలను గాడిలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, యువ మోర్చ నాయకులు కిరణ్ తదితరులు ఉన్నారు.