జాతీయ సమక్యతకు ఎన్‌సీసీ దోహదం

కెరీర్ తాండూరు వికారాబాద్

జాతీయ సమక్యతకు ఎన్‌సీసీ దోహదం
– విద్యార్థి దశ నుంచే శిక్షణను అలవర్చుకోవాలి
– తెలంగాణ లెఫ్టినెంట్ కల్నల్ రాకేష్ కుమార్
– వీవీటీఎస్‌లో ఎన్‌సీసీ ట్రూప్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ సమక్యతకు ఎన్‌సీసీ(నేషనల్ క్యాడెట్ కార్ప్స్) ఎంతో దోహద పడుతుందని 5(టీ) తెలంగాణ బెటాలియన్‌ లెఫ్టినెంట్ కల్నల్ రాకేష్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని వేధిక్ విశిష్ఠ ది స్కూల్(వీవీటీఎస్)లో ఎన్‌సీసీ ట్రూప్ ప్రారంభమయ్యింది.

ఈ కార్యక్రమానికి హాజరైన లెఫ్ట్ నెంట్ కల్నల్ రాకేష్‌ కుమార్‌కు స్కూల్ ఎన్‌సీసీ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెఫ్ట్ నెంట్ కల్నల్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సమక్యతను కాపాడేందుకు ఎసీసీ వ్యవస్థ దోహద పడుతుందన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఎన్‌సీసీలో శిక్షణ పొందడం వల్ల మంచి గుణాలు, ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యం, నిస్వార్ధ సేవా వంటి లక్షణాలు పెంపొందుతాయన్నారు. దీంతో పాటు ఎన్‌సీసీలో నైపుణ్యం పొందిన వారికి దేశంలో ఉన్నతమైన ఉద్యోగాలు, ఆర్మీ, అటవీ తదితర శాఖల్లో ఉద్యోగవకాశాలను పొందవచ్చన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రతి అంశాన్ని నేర్చుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగభూషణం, కరస్పాండెంట్ సుహాస్, డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి, రాములు, మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.