బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మురళీకృష్ణ గౌడ్
– నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నేత గాజీపూర్ మురళీకృష్ణ గౌడ్ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం అయ్యారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మురళీకృష్ణ గౌడ్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మురళి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ పటిష్టకై శయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎదుగుదలకు సహకరించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జ్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి, సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

